బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి | - | Sakshi
Sakshi News home page

బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి

Jun 8 2026 7:12 AM | Updated on Jun 8 2026 7:12 AM

బైక్‌పై నుంచి పడి యువకుడి మృతి

మైదుకూరు : మైదుకూరు మండలం మాచుగారిపల్లె వద్ద బైక్‌పై నుంచి కింద పడి కొండెపోగు కళ్యాణ్‌కుమార్‌(32) అనే యువకుడు మృతి చెందాడు. శనివారం రాత్రి జరిగిన ఈ సంఘటన గురించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రమైన బ్రహ్మంగారిమఠం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన కళ్యాణ్‌ కుమార్‌ కడపలోని ఓ బ్యాంక్‌లో అటెండర్‌గా పని చేస్తుంటాడు. అక్కడే ఉంటూ వారాంతంలో ఇంటికి వస్తుంటాడు. ఆ క్రమంలో శనివారం రాత్రి తన బంధువు భాస్కర్‌తో కలిసి బైక్‌పై కడప నుంచి మైదుకూరు మండలంలోని జీవీ సత్రం మీదుగా ఇంటికి బయల్దేరాడు. మాచుగారిపల్లె వద్ద బైక్‌ అదుపు తప్పడంతో కళ్యాణ్‌ కుమార్‌ బైక్‌పై నుంచి బోర్లా కిందపడ్డాడు. ముఖం, ముక్కు, నోటి నుంచి రక్తస్రావమై మృతి చెందాడు. సంఘటనపై మృతుడి తమ్ముడు ఓబులేసు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement