మంత్రి సమావేశానికి స్పందన కరువు | - | Sakshi
Sakshi News home page

మంత్రి సమావేశానికి స్పందన కరువు

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

పులివెందుల రూరల్‌ : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్‌ శనివారం పులివెందులలోని పాత బస్టాండ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయం సమీపంలో నిర్వహించిన సమావేశం కార్యకర్తలు లేక వెలవెలబోయింది. అరకొరగా వచ్చిన కార్యకర్తలు సైతం సమావేశం మధ్యలోనే వెనుతిరిగి వెళ్లిపోయారు. దీంతో కుర్చీలన్ని ఖాళీగా దర్శనమిచ్చాయి. మంత్రి సత్యకుమార్‌ పులివెందులకు రావడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పాత బస్టాండ్‌లోని ప్రధాన కూడలి వెంకటేశ్వర స్వామి ఆలయం సమీపంలో మంత్రి కాన్వాయ్‌ నడిరోడ్డుపై ఉంచడంతో వాహనాలన్నీ నిలిచిపోయాయి. దీంతో పాదచారులు, ద్విచక్ర వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

గిన్నిస్‌ బుక్‌ వరల్డ్‌ రికార్డు సాధించిన నిఖిల్‌

జమ్మలమడుగు : పట్టణంలోని నాగులకట్ట ప్రాంతానికి చెందిన కుందవరపు జెఫన్యా నిఖిల్‌ గిన్నిస్‌ బుక్‌ఆఫ్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం సంపాదించినట్లు తల్లిదండ్రులు కుందవరపు సురేష్‌, రాణి పేర్కొన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధుల ఆధ్వర్యంలో 22దేశాలకు చెందిన 2వేల మంది కీబోర్డు వాయిద్యకారులతో ఏకకాలంలో ఏకస్వరంతో కీబోర్డు వా యించి ప్రతిభను చాటాడు. ఈ మేరకు శుక్రవా రం హెలెన్‌ మ్యూజిక్‌స్కూల్‌ వ్యవస్థాపకుడు ఆగస్టీన్‌ ఆధ్వర్యంలో ఇండియన్‌ పెంతకోస్టల్‌ చర్చి విశాఖపట్నంలో గిన్నిస్‌ బుక్‌ఆఫ్‌ వరల్డ్‌ రికార్డు ప్రతినిధులు రికార్డు సర్టిఫికేట్లను ప్రదానం చేసినట్లు వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement