కమలాపురం : ఆరేళ్లలోపు చిన్నారుల్లో మానసిక లోపాలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నవచేతన అనే ఏఐ యాప్‌ను రూపొందించిందని ఐసీడీఎస్ పీడీ రమాదేవి తెలిపారు. స్థానిక డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రెండు రోజులుగా ఐసీడీఎస్ సిబ్బందికి జరుగుతున్న శిక్షణా కార్యక్రమాన్ని ఆ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. శిక్షణలో చెబుతున్న అంశాలపై ఆరా తీశా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చిన్నారుల్లో తొలిదశలో తలెత్తే మానసిక ఎదుగుదల లోపాలను గుర్తించి అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆమె వివరించారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారుల్లో స్థూల, సూక్ష్మ, చలన నైపుణ్యాలు, భాషా వికాసం, జ్ఞాన వికాసం, సామాజిక భావోద్వేగాల వృద్ధిని నవచేతన ద్వారా అంచనా వేస్తామన్నారు. లోపాలను గుర్తించి ముందస్తు జోక్యం ద్వారా సరిచేయవచ్చన్నారు. సీడీపీఓ శ్రీలతారెడ్డి, అర్బన్ పీహెచ్‌సీ డాక్టర్ ముని శేఖర్, ఐసీడీఎస్ సూపర్ వైజర్లు వెంకట సుబ్బమ్మ, పార్వతి, లక్ష్మీదేవి తదితరులు సిబ్బందికి నవచేతన యాప్‌లో చిన్నారుల పై చేసిన సర్వే అంశాల నమోదు పై శిక్షణనిచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.
ఐసీడీఎస్ పీడీ రమాదేవి


