అన్నీ తానై ...అన్నిట్లో తలమునకలై | - | Sakshi
Sakshi News home page

అన్నీ తానై ...అన్నిట్లో తలమునకలై

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

టాస్క్‌ఫోర్సు: డీఎస్సీలో జరిగిన అవకతవకలపై గత కొద్ది రోజులుగా ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమవుతున్నాయి. దీనికి ఉక్కిరి బిక్కిరవుతున్న కూటమి ప్రభుత్వం ఏం చేయాలో తెలియక ఎక్కడిక్కడ ఖడించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల కడపలోని హరిత హాటల్‌లో ఎమ్మెల్సీ రాంగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ అనుబంధ విద్యార్థి, అనుబంధ టీచర్ల సంఘాల నాయకులతోపాటు కొత్తగా ఉద్యోగాలకు ఎంపికై న డీఎస్సీ అభ్యర్థులతో నిరుద్యోగ యువతపై గొడ్డలి వేటు అనే కార్యక్రమాన్ని నిర్వహించి డీఎస్సీలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. అంతా పారదర్శకంగా నిర్వహించామంటూ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. అయితే ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా ఇందులో జిల్లా ఓపెన్‌స్కూల్‌ జిల్లా కో–ఆర్డినేటర్‌ సాంబ శివారెడ్డి పాల్గొని అన్నీ తానై వ్యవహరించారు.ఎమ్మెల్సీ వెంట తిరగడం, వచ్చిన వాళ్లను పలకరించడం వంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ హడావుడి చేస్తూ కనిపించాడు. కొన్ని ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు.

గ్రీవెన్స్‌లో ఫిర్యాదుకు సమాయత్తం...

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఓపెన్‌ స్కూల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ సాంబశివారెడ్డిపై విద్యార్థి సంఘనాయకులు సోమవారం ప్రజా పిర్యాదుల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమౌతున్నారు. ఇది ప్రభుత్వ కార్యక్రమం కాకపోయినా అయన పాల్గొనటం మేమినటి ప్రశ్నించారు.

ప్రైవేట్‌ కార్యక్రమంలో హల్‌ చేసిన

ఓపెన్‌ స్కూల్‌ కో–ఆర్డినేటర్‌

పలువురు ఉపాధ్యాయ సంఘ

నాయకులు హాజరు

Advertisement
 
Advertisement
Advertisement