ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిపై ఓబుళాపురం సమీపంలో శనివారం గుర్తుతెలియని వాహనం ఢీకొని మారుతి (30) అనే యువకుడు మృతి చెందాడు. సీఐ నగేష్‌బాబు వివరాల ప్రకారం.. ఓబుళాపురం గ్రామానికి చెందిన మారుతి బైక్‌లో కొండాపురం నుంచి ఇంటికి వస్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ నగేష్‌బాబు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మారుతి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడని, 3 నెలల కిందటే వివాహమైనట్లు బంధువులు తెలిపారు.


