రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

బద్వేలు (అట్లూరు) : బద్వేలు మండలం రాజుపాళెం గ్రామ సమీపంలో కడప – బద్వేలు రహదారిపై శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల వివరాల మేరకు సిద్ధవటం నుంచి బద్వేలుకు వెళుతున్న ఆటో, బద్వేలు నుంచి సిద్ధవటం వెళుతున్న కారు రాజుపాళెం గ్రామ సమీపాన ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న అట్లూరు మండలం లింగాలకుంటకు చెందిన సంగటి వెంకటసుబ్బమ్మ, బి.కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామానికి చెందిన గంగమ్మ, బద్వేలు మండలం రాజుపాళెం గ్రామానికి చెందిన సుబ్బమ్మలకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు 108 అంబులెన్స్‌లో బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం వారిని కడప రిమ్స్‌కు తీసుకెళ్లినట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement