కమలాపురం: మండంలోని దాదిరెడ్డిపల్లెకు చెందిన నారాయణమ్మ కమలాపురం 108 వాహనంలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నారు. 108 సిబ్బంది కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఎల్లారెడ్డిపల్లెకు చెందిన నారాయణమ్మకు శనివారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో 108 వాహనం గ్రామానికి చేరుకుని నారాయణమ్మను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో నొప్పులు ఎక్కువై ప్రసవం జరిగింది. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించారు. నారాయణమ్మ కుటుంబం 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు.
165 బస్తాల విత్తన వడ్లు స్వాధీనం
ప్రొద్దుటూరు రూరల్ : పట్టణంలోని మైదుకూరు రోడ్డు లో ఉన్న వరసిద్ధి వినాయక విత్తన కేంద్రంలో శనివారం విజిలెన్స్,ఎన్‌ఫోర్స్‌మెంట్, వ్యవసాయశాఖ అధికారు లు తనిఖీ చే శారు. దుకాణంలో విత్తన చ ట్టం 1965 నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన 165 బస్తాల కేఎన్‌ఎం రకం వరి విత్తన ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని, దుకాణ యజమాని రమణారెడ్డిపై 6–ఏ కేసు నమోదు చేశారు. 30 కేజీల తూకం కలిగిన విత్తన వడ్ల బస్తాను రూ.1200లకు విక్రయిస్తున్నట్లు అధికారులు గు ర్తించారు. తనిఖీల్లో స్థానిక మండల వ్యవసాయాధికారి వరహరికుమార్,విజిలెన్స్‌అధికారిజి.లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు.


