భూసమస్యల పరిష్కారానికి జవాబుదారీగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

భూసమస్యల పరిష్కారానికి జవాబుదారీగా ఉండాలి

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

బద్వేలు అర్బన్‌ : జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖ ప్రత్యేక చొరవ చూపుతోందని,ఇందుకోసం అధికారులంతా జవాబుదారీగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పేర్కొన్నారు. ఒక నెల – ఒక నియోజకవర్గం్ఙకార్యక్రమంలో భాగంగా శుక్రవారం స్థానిక రాఘవేంద్ర గ్రాండ్‌ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు ప్రజా సమస్యల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ సమావేశం లో స్వీకరించిన సుమారు 200 ఫిర్యాదులను పరిష్కరించేందుకు అధికారులకు స్పష్టమైన గడువును విధించామని తెలిపారు.రాబోయే మూడు నుంచి నాలుగు వారాల్లో వీటిని పరిష్కరించి,తుది నివేదికను దరఖాస్తుదారులకు అందజేయాలని ఆయన స్పష్టం చేశారు. బద్వేలు నియోజకవర్గంలో ఉన్న భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు.కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ నిధిమీనా,ఆయా శాఖల జిల్లా అధికారులు,బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్‌,డీసీసీబి చైర్మన్‌ మంచూరుసూర్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రారంభోత్సవానికి సిద్ధం అవుతున్న

‘స్టార్ట్‌ అప్‌ కడప’

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లా యువతకు నైపుణ్య నిధిగా, రాష్ట్రానికే స్ఫూర్తిగా రూపుదిద్దుకుంటున్న శ్రీస్టార్ట్‌ అప్‌ కడప్ఙఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ సెంటర్‌ అతి త్వరలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోందని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కడపలోని పి–4 విధానం ద్వారా ఇన్నోవేటీవ్‌ గా నిర్మిస్తున్న శ్రీస్టార్ట్‌ అప్‌ కడప్ఙఎంటర్‌ ప్రెన్యూర్‌ షిప్‌ సెంటర్‌ నిర్మాణ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. బాహ్య నిర్మాణ పనులను త్వరగా పూర్తిగా చేయాలన్నారు. నాణ్యతలో ఎలాంటి రాజీపడొద్దని సంబందిత ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేఎంసీ అదనపు కమిషనర్‌ రాకేష్‌ చంద్రం, హౌసింగ్‌ ఇంజనీర్లు, ఏడిపి యంగ్‌ ప్రొఫెషనల్స్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement