వాహనం సహా ఎర్రచందనం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

వాహనం సహా ఎర్రచందనం స్వాధీనం

Jun 6 2026 1:17 AM | Updated on Jun 6 2026 1:17 AM

పులిచెర్ల (కల్లూరు) : కల్లూరులో వాహనం సహా ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కల్లూరు బీసీ కాలనీలో శుక్రవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. వారిని చూసిన కారు డ్రైవర్‌ కొంత దూరం వెళ్లి.. వాహనాన్ని వదిలి పారిపోయాడు. పోలీసులు పరిశీలించగా.. కారులో 12 ఎర్రచందనం దుంగలు ఉండటాన్ని గమనించారు. వాహనాన్ని కల్లూరు పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. అందులో 12 దుంగల బరువు 358 కేజీలుగా గుర్తించారు. వాటి విలువ రూ.16.46 లక్షలు, వాహనం విలువ రూ.4 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement