కడపలో టీడీపీ మేనిఫెస్టో కాపీలను దహనం చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు
ప్రొద్దుటూరులో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
యర్రగుంట్లలో మేనిఫెస్టో కాపీలను దహనం చేస్తున్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి
చెన్నూరు: మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్‌రెడ్డి
మేనిఫెస్టోకు హామీల రంగులద్దీ..మోసపూరిత ప్రకటనలతో మాయ చేసిన కూటమి నేతల తీరుపై జనం భగ్గుమన్నారు.
ఇంటింటికీ తిరిగి ఉత్తుత్తి బాండ్లు పంచి.. నిలువునా వంచించిన పచ్చ పాలకులపై ధ్వజమెత్తారు. ‘నీకు..నీకు..నీకు..’ అంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి.. అధికారంలోకి వచ్చాక హామీలు అటకెక్కించడంపైఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు ‘బాబు ష్యూరీటీ’ అంటూ బాండ్లు పంచిన నేతలు ఇప్పుడెక్కడున్నారని ప్రశ్నల వర్షం కురిపించారు. మేనిఫెస్టో కాపీలను మంటల్లో కాల్చివేశారు.. బాండ్ల ప్రతులను అడ్డంగా చించేశారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి సర్కారు కొలువుదీరి రెండేళ్లు గడిచినా హామీలు అమలు చేయని నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమం నిర్వహించింది. జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ కార్యక్రమంలో
నిరసన
మిన్నంటింది.
దగాపడ్డ ప్రజాస్వామ్యంపై దండోరా వేస్తున్న ప్రజాక్షేత్రం
వైఎస్సార్‌సీపీతో కలిసి ఊరువాడ ధర్మాగ్రహం
పోరుమామిళ్ల: నిరసనలో ప్రసంగిస్తున్న ఎమ్మెల్యే సుధ, చిత్రంలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి , పార్టీ శ్రేణులు
సాక్షి ప్రతినిధి, కడప: చంద్రబాబు సర్కార్ ఎన్నికల హామీలు విస్మరించడంపై వైఎస్సార్‌సీపీ నిప్పులు చెరిగింది. ప్రజలకు వెన్నుపోటు పొడవడంపై ఉవ్వెత్తున రగిలిపోయింది. ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరశనలో భాగంగా గురువారం మండల, నియోజకవర్గ కేంద్రాలల్లో ప్రజలతో కలిసి భారీ ఎత్తున ప్రత్యక్ష ఆందోళన చేపట్టింది. టీడీపీ మ్యానిఫెస్టో, సూపర్ సిక్స్ కరపత్రాలు, ‘బాబు ష్యూరిటీ–భవిష్యత్ గ్యారెంటీ’బాండ్లు ఆయా కేంద్రాల్లో దహనం చేశారు. కూటమి సర్కార్ హామీలు విస్మరించడంపై నిప్పులు చెరిగారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలన, ఇప్పటి కూటమి పాలనను ప్రజలు భేరీజు వేసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు.
చంద్రబాబు ప్రభుత్వం మహిళలు, నిరుద్యోగులు, రైతులు ఇ లా అన్నీ వర్గాల ప్రజల్ని మో సం చేసిందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి మండిపడ్డారు. పెండ్లిమర్రి, చింతకొమ్మదిన్నె మండలాలల్లో చేపట్టిన నిరశనలో ఆయన పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ప్రతి మీటింగ్ లోను సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని విపరీతంగా ప్రచారం చేశారని అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో వైఫల్యం చెందారని ధ్వజమెత్తారు.
● ప్రొద్దుటూరులో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆధ్వర్యంలో గాంధీ పార్కు వద్ద కూటమి ప్రభుత్వం గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ బాండ్లను ప్రదర్శించారు. నిరుపయోగంగా ఉండిపోయిన బాండ్లను చించేశారు.
● కడపలో మాజీ మేయర్లు కొత్తమద్ది సురేష్‌బాబు, పాకా సురేష్ నిరశన కార్యక్రమాన్ని కొనసాగించారు. సూపర్‌సిక్స్ పథకాలు అమలు చేయకపోవడం, ప్రజలకు వెన్నుపోటు పొడవడంపై మండిపడ్డారు.
● నియోజకవర్గ కేంద్రమైన మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పాల్గొని ప్రసంగించారు. సీఎం చంద్రబాబు జీవితమంతా వెన్ను పోటు వ్యవహారమేనని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబు పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని కోరారు. ఆ ఐదేళ్లలో ప్రతి కుటుంబం బాగుపడాలనే దృడసంకల్పంతో వైఎస్ జగన్ పాలన అందించారని గుర్తు చేశారు.
● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి యర్రగుంట్ల, ముద్దనూరు కేంద్రాలల్లో చేపట్టిన నిరశన కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని, అప్పులు కుప్పలు తెప్పలుగా తెస్తున్నా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆరోపించారు.
● నియోజకవర్గ కేంద్రమైన కమలాపురం, వల్లూరు కేంద్రాల్లో కమలాపురం సమన్వయకర్త నరేన్‌రామాంజులరెడ్డి నిరసనల్లో పాల్గొన్నారు. 16ఏళ్లు సిఎంగా చెప్పుకోవడం మినహా చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం కూడా గుర్తు రాదని ఎద్దేవా చేశారు.
● పులివెందులలో మున్సిపల్ ఇన్‌ఛార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత వైఎస్ మధనమోహన్‌రెడ్డి నేతృత్వంలో నిరశన చేపట్టారు. అపద్దపు హామీలతో గద్దెనెక్కి ప్రజల్ని చంద్రబాబు మోసగించారని ధ్వజమెత్తారు.
● పోరుమామిళ్లలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మె ల్యే డాక్టర్ సుధా పాల్గొని ప్రసంగించారు. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వంపై భరోసా లేకుండా పోయిందని వాపోయారు. వంచించడం మినహా చేయూతనివ్వాలనే దిశగా సీఎం చంద్రబాబు సర్కార్ వ్యవహరించడం లేదని మండిపడ్డారు.
● ఒంటిమిట్టలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథరెడ్డి నిరశన కార్యక్రమంలో పాల్గోని ప్రసంగించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు చేయకుండా వెన్నుపోటు పొడిచారని ఇంత దారుణంగా మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలే గద్దె దించుతారన్నారు. వంచించడమే ఆయన నైజమని దెప్పిపొడిచారు. జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ చేపట్టిన నిరశనలు మిన్నంటాయి.
మైదుకూరులో వెన్నుపోటుపై నిరసన వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి తదితరులు
కమలాపురంలో ‘బాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ కార్యక్రమంలో నరేన్ తదితరులు
బాండు పేపర్లను దహనం చేసి నిరసన వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ఆకేపాటి


