చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

Jun 5 2026 4:05 AM | Updated on Jun 5 2026 4:05 AM

ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఉన్న శ్రీనిధి లీడర్స్‌ మిల్లులో జరిగిన చోరీ కేసుకు సంబంధించి టూ టౌన్‌ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఏఎస్పీ విభూ కృష్ణ గురువారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మీడియాకు వివరాలు వెల్లడించారు. మిల్లులో ఆపరేటర్‌గా పనిచేస్తున్న కిరణ్‌కు వ్యాపార వేత్తలు గదిలో భారీ మొత్తంలో నగదు భద్రపరుస్తారనే విషయం తెలిసి, తన వ్యక్తిగత అప్పులు తీర్చుకోవాలనే ఉద్దేశంతో దొంగతనానికి పథకం రచించాడు. ఈ క్రమంలో గత నెల 30న అర్ధరాత్రి సమయంలో మిల్లులోకి ప్రవేశించాడు.ముందుగా సీసీ కెమెరా వైర్‌ను కత్తిరించాడు. గది లోపలికి ప్రవేశించి, ఇనుప బీరువాను పగులగొట్టి అందులో ఉన్న డబ్బు బ్యాగ్‌ను అపహరించాడు. ఈ సమయంలో ఉత్తయ్య అతనికి సహకరిస్తూ కాపలా కాశాడు. అనంతరం నేరాన్ని గుర్తించకుండా ఉండేందుకు గదిలో, బీరువాలో, నగదు సంచిలో కారంపొడి చల్లినట్లు దర్యాప్తులో తేలింది. నిందితుల వద్ద నుంచి మొత్తం రూ.11.36 లక్షలు నగదు, నేరానికి ఉపయోగించిన ఇనుప సుత్తె, ఆకుపచ్చ రంగు గుడ్డ బ్యాగ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు ఏఎస్పీ విభూకృష్ణ తెలిపారు. ఈ కేసును అత్యంత తర్వగా ఛేదించి, చోరీ సొత్తును రికవరీ చేసిన టూటౌన్‌ సీఐ వంశీనాథ్‌, సిబ్బందిని, అదనపు పోలీసులను ఏఎస్పీ అభినందించారు.

రూ.11.36 లక్షలు స్వాధీనం

Advertisement
 
Advertisement
Advertisement