గోపవరం : మండలంలోని శ్రీనివాసపురం ఎస్టీకాలనీకి చెందిన ఇండ్లనాగేంద్ర మూడు రోజుల క్రితం చేపల వేట కోసం వెళ్లి ప్రమాదవశాత్తు గ్రామానికి సమీపంలో ఉన్న బావిలో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. కుటుంబ సభ్యులు, స్థానికులు బద్వేలు రూరల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం ఉదయం ఎస్‌ఐ రంగారావు, సిబ్బంది బావిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీపీపీలో మాక్ డ్రిల్
ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు(ఆర్టీపీపీ)లో అత్యవసర పరిస్థితులపై అప్రమత్తంగా ఉండటం ఎలా అనే అంశంపై గురువారం ఆన్–సైట్ ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ మాక్ డ్రిల్‌ను డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ పర్యవేక్షణ చేశారు. కార్యక్రమంలో ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావు, ఎస్‌ఈ సోమశేఖర్‌రెడ్డి, ఫ్యాక్టరీ మేనేజర్ హనుమన్న, డివిజనల్ ఫైర్ అధికారి బిఎల్‌పీ శాస్త్రి, ఎస్‌పీఎఫ్ ఏసీ క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.


