436 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

436 బస్తాల రేషన్‌ బియ్యం స్వాధీనం

Jun 5 2026 4:05 AM | Updated on Jun 5 2026 4:05 AM

బద్వేలు అర్బన్‌ : బద్వేలులో గురువారం విజిలెన్స్‌ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె మిట్టలోని ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన 436 బస్తాల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్‌ అధికారులు తెలిపిన వివరాల మేరకు నడిపిపోలయ్య అనే వ్యక్తి రేషన్‌ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు అందిన సమాచారం మేరకు విజిలెన్స్‌, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ ఇంటిలో అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్‌ బియ్యాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌కు తరలించారు. అలాగే నడిపిపోలయ్యపై బద్వేలు అర్బన్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ దాడుల్లో విజిలెన్స్‌ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ శివశంకర్‌, ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ గీతాప్రసాద్‌రెడ్డి, విజిలెన్స్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement