గండికోటలో విరోష్‌ జంట సందడి | - | Sakshi
Sakshi News home page

గండికోటలో విరోష్‌ జంట సందడి

Jun 4 2026 5:16 AM | Updated on Jun 4 2026 5:16 AM

జమ్మలమడుగు : పర్యాటక కేంద్రమైన గండికోటలో ప్రముఖ హీరోయిన్‌ రష్మిక మందన, నటుడు విజయ్‌ దేవరకొండ సందడి చేశారు. రెండు రోజులుగా ఈ ప్రాంతంలో రణబాలి సినిమా చిత్రీకరణ కొనసాగుతోంది. మంగళవారం హీరో విజయ్‌దేవరకొండపై కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. బుధవారం గండికోటలోని మాధవరాయస్వామి ఆలయం, జుమ్మా మసీదు సమీపంలోని ధాన్యాగారంలో రష్మిక మందన, విజయ్‌తో షూటింగ్‌ చేశారు. చిత్రీకరణ మరో రెండు రోజుల పాటు కొనసాగుతుందని యూ నిట్‌ సభ్యులు తెలియజేశారు. సినిమా చిత్రీకరణను తిలకించేందుకు స్థానికులు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement