చంద్రబాబు ప్రభుత్వంలో అన్ని వర్గాలకు అన్యాయం
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి
పులివెందుల: రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం వల్ల అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న తన స్వగృహంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, రైతులకు ఏడాదికి రూ.20వేలు వంటి అనేక అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారన్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3లక్షల కోట్ల బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకు ఎలాంటి కేటాయింపులు చేయలేదన్నారు. కేవలం కమీషన్ల కోసం చంద్రబాబు, తన కుమారుడు లోకేష్‌లు ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. వైఎస్ జగనన్న హయాంలో ఒప్పందం చేసుకున్న కంపెనీలను తమ ప్రభుత్వంలో తామేదో సాధించినట్లుగా క్రెడిట్ చోరీ చేస్తూ ఎల్లో మీడియా ద్వారా డప్పులు కొట్టుకుంటున్నారన్నారు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబు చేసిన మోసాలను గమనిస్తున్నారని తగిన విధంగా బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు.
● కాకినాడ అగ్ని ప్రమాద ఘటనలో పలువురు మృతి చెందడంపట్ల ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియో ప్రకటించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.


