రాయలసీమకు జీవనాడి | - | Sakshi
Sakshi News home page

రాయలసీమకు జీవనాడి

Mar 2 2026 7:47 AM | Updated on Mar 2 2026 7:47 AM

రాయలస

రాయలసీమకు జీవనాడి

రాయలసీమ ఎత్తిపోతల పథకం ఈ ప్రాంతానికి జీవనాడి లాంటిది. మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రూ.3870 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కళ్లలో ఆనందం చూడటానికి మన ప్రాంత ప్రయోజనాలను ఫణంగా పెట్టడం దారుణం. వ్యవసాయం దండగ, ప్రాజెక్టులు వృథా అనే మనస్తత్వం కలిగిన వ్యక్తి సీఎంగా ఉండటం మన దౌర్భగ్యం. 4 సార్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు రాయలసీమలో ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టలేదు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి లక్ష కోట్లతో కోటి ఎకరాలకు సాగునీరందించేలా జలయజ్ఞం చేపట్టారు. దానిని కొనసాగిస్తూ వెనుకబడిన ప్రాంతాలు సస్యశ్యామలం చేసేలా మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే రాయలసీమ ఎత్తిపోతల పథకం తెరపైకి వచ్చింది. –పి. రవీంద్రనాథ్‌రెడ్డి,

వైఎస్సార్‌కడప జిల్లా అధ్యక్షుడు,

వైఎస్‌ జగన్‌కు మంచిపేరొస్తుందనే

రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టును చంద్రబాబు ఉద్దేశపూర్వకంగానే ఆపేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచిపేరు వస్తుందనే ఇలా చేశారు. నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాలు ఉన్నా, వాటిలో చంద్రబాబు 36 టీఎంసీలకు మించి నిల్వ చేసిన దాఖలాలు లేవు. వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ మాత్రమే 78 టీఎంసీలు నిల్వ చేశారు. చంద్రబాబు ఎప్పుడు సీఎం అయినా పొరుగు రాష్ట్రాలు అలుసుగా తీసుకొని అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తారు. – కాకాణి గోవర్థన్‌రెడ్డి,

నెల్లూరు జిల్లా అధ్యక్షులు.

పరిశ్రమలను అభివృద్ధి చేయాలి

రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయంతోపాటు పరిశ్రమలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. ఈ ప్రాంతంలో సాగు, తాగునీటి కోసం స్వాతంత్య్రానికి పూర్వం నుంచి పోరాటం చేస్తున్నాం. అల్మట్టి సామర్థ్యం మొదట్లో 17 టీఎంసీలు మాత్రమే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే దాని సామర్థ్యాన్ని 125 టీఎంసీలకు పెంచారు. ఇప్పుడు మళ్లీ ఆయన సీఎంగా ఉన్నప్పుడే 229 టీఎంసీలకు పెంచబోతున్నారు. – ఎ.వెంకట్రామిరెడ్డి, అనంతపురం జిల్లా అధ్యక్షులు

చంద్రబాబు రాయలసీమ ద్రోహి

చంద్రబాబు ఎప్పుడు సీఎంగా ఉన్నా రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. ఈ ప్రాంతానికి ద్రోహం చేసేలా వ్యవహరించారు. రాయలసీమ లిఫ్ట్‌ ద్వారా 800 అడుగుల్లోనే నీటిని తోడుకునేలా వైఎస్‌ జగన్‌ ప్రాజెక్టు చేపట్టారు. ఇది లేకపోతే సీమ ప్రయోజనాలను కాపాడుకోలేం. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఈ ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి. –కాటసాని రాంభూపాల్‌రెడ్డి,

నంద్యాల జిల్లా అధ్యక్షులు

రాయలసీమకు జీవనాడి 
1
1/3

రాయలసీమకు జీవనాడి

రాయలసీమకు జీవనాడి 
2
2/3

రాయలసీమకు జీవనాడి

రాయలసీమకు జీవనాడి 
3
3/3

రాయలసీమకు జీవనాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement