చర్యలు తీసుకోవాలి
అధికార పార్టీ నాయకులు స్పందించాలి. రైతుల బాధ మీకు తెలియదా.. ఒకప్పుడు మీరు కూడా రైతు బిడ్డలే కదా.. మీరు కూడా రైతు కుటుంబంలో వచ్చిన వారే కదా. ఎలక్ట్రికల్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ల అధికారులు స్పందించడం లేదు. తక్షణమే కలెక్టర్ స్పందించి తగిన నిర్ణయం తీసుకుని సమస్య లేకుండా చేయాలి. దయచేసి కలెక్టర్ కానీ, జేసీ కానీ, ఇరిగేషన్ అధికారులు కానీ, అధికారంలో ఉన్న పెద్దలు కానీ తక్షణమే స్పందించి విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని కోరుతున్నాం. – మల్లికార్జునరెడ్డి,
రైతు, వెలిదండ్ల, లింగాల మండలం


