పురాతన తెలుగు శాసనం గుర్తింపు
సిద్దవటం : వైఎస్‌ఆర్ కడప జిల్లా సిద్దవటం మండలంలోని టక్కోలు గ్రామానికి తూర్పు దిశగా ఉన్న శివాలయంలో మరో పురాతన తెలుగు శాసనాన్ని గుర్తించినట్లు దక్షిణ భారత పర్యాటక సంస్థ జిల్లా అధ్యక్షుడు జ్యోతిజార్జి, కార్యదర్శి మురికినాటి శ్రీనివాసులు గురువారం తెలిపారు. ఇటీవల పెన్ననాది ఒడ్డున ఉన్న మాచుపల్లి, ఖాదర్ బంగ్లా బ్రిడ్జికి సంబంధించిన పునాది శిలాఫలకాన్ని సందర్శించిన అనంతరం మాచుపల్లిలోని శ్రీ రేణుకా ఎల్లమాంబ ఆలయానికి వెళ్లారు.ఇందులో భాగంగా టక్కోలు గ్రామానికి చెందిన శివాలయాన్ని సందర్శించగా అక్కడ ప్రాచీన తెలుగు శాసనాన్ని గుర్తించినట్లు తెలిపారు. టక్కోలు శివాలయ శాసనంలోని సారాంశం కోసం మైసూర్‌లోని ప్రాచీన శాసనాల పరిశీలనా సంచాలకులు (డైరెక్టర్) ఆచార్య మునిరత్నంరెడ్డికి కూడా పంపినట్లు వారు పేర్కొన్నారు.


