ఇసుక రీచ్ తనిఖీ
సుండుపల్లె : మండల పరిధిలోని ఎర్రమనేనిపా లెం సమీపంలోని బహుదానదిలో ఇసుకరీచ్‌ను గురువారం రాజంపేట సబ్ కలెక్టర్ హెచ్‌ఎస్ భావన, ఏఎస్పీ మనోజ్ రామనాథ్‌హెగ్డే తనిఖీ చేశారు. ఇసుకను ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా నమోదు చేసుకుని రవాణా చేస్తున్నారా లేదా అని తనిఖీ చేశారు. రీచ్‌లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించారు.కార్యక్రమంలో సుండుపల్లె తహసీల్దార్ మహబూబ్‌చాంద్, ఆర్‌ఐ జ్యోతిర్మయి, వీఆర్‌ఓలు పాల్గొన్నారు.
వీఆర్వో వేణుగోపాల్ సస్పెన్షన్
కడప సెవెన్‌రోడ్స్ : చెన్నూరు మండలం రామనపల్లి వీఆర్వో వేణుగోపాల్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఉత్తర్వులు జారీ చేశారు. రామనపల్లి గ్రామ రెవెన్యూ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న వేణుగోపాల్‌పై అందిన లైంగిక వేధింపుల ఫిర్యాదు మేరకు క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఆయనను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆర్టీసీ బస్సును ఢీకొన్న సిమెంట్ ట్యాంకర్
చాపాడు : మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని చాపాడు మండలం బద్రిపల్లె వద్ద గురువారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ సత్యంకు గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు వైపు నుంచి మైదుకూరుకు వెళుతున్న పల్లెవెలుగు ఆర్టీసీ బస్సు బద్రిపల్లె వద్ద ప్రయాణికులను దింపేందుకు ఆగింది. ఇదే క్రమంలో ప్రొద్దుటూరు నుంచి మైదుకూరు వైపు వస్తున్న సిమెంట్ లోడ్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు ముందున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది. ఈ ప్రమాదంలో ట్యాంకర్ డ్రైవర్ సత్యంకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాద ఘటనపై పోలీసుల వద్దకు చేరకుండానే పంచాయితీ చేసుకున్నారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణాపాయం చోటు చేసుకోకపోవడం గమనార్హం.
అదుపుతప్పి
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులో గురువారం సాయంత్రం అదుపుతప్పి కారు ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సుమిత్రానగర్ నుంచి ఓ కారు సిద్దవటం రోడ్డు వైపునకు వచ్చే క్రమంలో బైక్ అడ్డు రావడంతో సదరు కారుడ్రైవర్ బ్రేక్ వేయబోయి పొరపాటున ఎక్స్‌లేటర్ తొక్కడంతో కారు వేగంగా ఎదురుగా ఉన్న ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. అయితే ఆ సమయంలో ఇంట్లోని వారు ఎవరూ బయట లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
‘శోభాయాత్ర ర్యాలీ’లో
అపశృతి
● బాణసంచా పేలి సెక్యూరిటీ గార్డుపై
దూసుకెళ్లిన రాకెట్
● పొట్టలో నుంచి బయటపడిన పేగులు
కడప అర్బన్ : కడప నగరంలో గురువారం శ్రీరాముల వారి శోభయాత్ర ఉదయం ప్రారంభమైంది. రాత్రి బాణాసంచా పేల్చే సమయంలో అపశృతి చోటుచేసుకుంది. రాకెట్ పేల్చే సమయంలో అది పైకి వెళ్లకుండా నేరుగా ఏడు రోడ్ల కూడలిలో వున్న శ్రీకృష్ణ వెజ్ హోటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న హరి(55) అనే వ్యక్తి కడుపులోకి దూసుకెళ్లింది. దీంతో అతని పొట్టలో నుంచి పేగులు బయటికి పడ్డాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న వన్ టౌన్ ఎస్‌ఐలు అమరనాథ్ రెడ్డి, ప్రదీప్‌కుమార్, చిన్న చౌక్ ఎస్‌ఐలు ఎన్.రాజరాజేశ్వర్ రెడ్డి, ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి గాయపడ్డ వ్యక్తిని చికిత్స నిమిత్తం 108లో రిమ్స్‌కు తరలించారు. సెక్యూరిటీ గార్డు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రస్తుతం రిమ్స్‌లో వైద్యులు మెరుౖగైన చికిత్స అందిస్తున్నారు. ఈసంఘటనపై పోలీసు అధికారులు, రిమ్స్ అధికారులు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.
కడప కోటిరెడ్డిసర్కిల్ : గ్రంథాలయానికి వచ్చే పాఠకులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి బానుప్రకాశ్ ఆదేశించారు. గురువారం ఆయన కడపలోని బాల బాలికల గ్రంథాలయాన్ని తనిఖీ చేశారు. తొలుత గ్రంథాలయానికి సంబంధించిన హాజరు, స్టాక్ రిజిస్టర్లు, పుస్తకాల లభ్యత, రీడింగ్ రూమ్ నిర్వహణ తదితర రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల బాలికలు, విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు సరిపడా ఉండేలా చర్యలు తీసుకోవాలని, పోటీ పరీక్షలకు సంబంధించిన గ్రంథాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ఈ క్రమంలో రోజువారీ పత్రికలు, వారపత్రికలు (వీక్లీ మ్యాగజైన్లు) తప్పనిసరిగా తెప్పించి పాఠకులకు అందుబాటులో ఉంచాలని గ్రంథాలయ అధికారి సురేష్‌ను ఆదేశించారు.గ్రంథాలయ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలంటే సిబ్బంది సమయపాలన, బాధ్యతాయుత సేవలు ముఖ్యమని ఈ సందర్భంగా చైర్మన్ దాసరి భాను ప్రకాష్ తెలియజేశారు.
రోడ్డు ప్రమాదంలో దెబ్బతిన్న
ఆర్టీసీ బస్సు, సిమెంట్ లోడు ట్యాంకర్
ఇసుక రీచ్ తనిఖీ
ఇసుక రీచ్ తనిఖీ


