రైల్వే కేంద్రం ఆకస్మిక తనిఖీ
నందలూరు: నందలూరు రైల్వే కేంద్రాన్ని గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం) చంద్రశేఖర్ గుప్తా గురువారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. రైల్వేస్టేషన్, పార్కులు, ఇన్‌స్టిట్యూట్, జిమ్, రీడింగ్‌రూంలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘ నేతలు ఎంబలూరు నరసింహస్వామి, మేడా వెంకటకుమార్, గెలివి శివశంకర్, వల్లంకొండు శివకుమార్, సర్పంచ్ సూర్యనారాయణ, రైల్వే రిటైర్డ్ ఉద్యోగి కమల్‌బాషా డీఆర్‌ఎంను కలిసి మాట్లాడారు. హైదరాబాద్, చైన్నె వెళ్లే రైళ్లకు నందలూరులో స్టాపింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డీఆర్‌ఎం వీలైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో డీఈఎన్ (సౌత్) సుదర్శన్‌రెడ్డి, స్టేషన్ మేనేజర్ కమలాకర్, ఆర్‌పీఎఫ్ ఎస్‌ఐ త్రివేణి, సీఎల్‌ఐ పెంచలయ్య, సిసిసి విశ్వనాథ్, చీఫ్ ఆఫీస్ సూపరింటెండెంట్ రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.


