● దరఖాస్తు చేసుకొనే విధానం
కడప కోటిరెడ్డిసర్కిల్: వివాహమై ఎన్నో ఏళ్లు గడిచినా సంతాన సాఫల్యానికి నోచని దంపతులకు దత్తత ఓ వరం. దత్తత తీసుకోవడంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అనధికార దత్తత చట్టరీత్యా నేరం కూడా అవుతుంది. కొంతమంది ఈ విషయం తెలియక దళారుల చేతిలో మోసపోతున్నారు. అక్రమ మార్గాలను ఎంచుకుని చిక్కుల్లో పడుతున్నారు. జాతీయ దత్తత మాసోత్సవం సందర్భంగా నెలరోజులపాటు సీ్త్ర శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో దత్తతపై అవగాహన కార్యక్రమాలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో కడపలో శిశు గృహ కేంద్ర అధికారులు దత్తత ఏ విధంగా పొందాలి? దత్తత తీసుకునేందుకు ఉండాల్సిన అర్హతగల గురించి ప్రజలకు విస్తృత అవగాహన కల్పించనున్నారు. అర్హత కలిగిన వారికి చిన్నారులను దత్తత ఇస్తూ అందిస్తున్నారు.
అర్హతలు
● దంపతుల వయస్సు, వైవాహిక బంధం ఆధారంగా చిన్నారులను దత్తత ఇస్తారు.
● కనీసం రెండేళ్లపాటుఎలాంటి గొడవలు లేకుండా సాఫీగా జీవిస్తున్న దంపతులు అర్హులు.
● రెండేళ్లలోపు పిల్లలను దత్తత తీసుకోవాలంటే దంపతుల్లో మగవారి వయస్సు 45, ఆడవారి వయస్సు 40కి మించకూడదు.
● ఒంటరిమహిళల వయస్సు 40కి మించకూడదు.
● దత్తత కోరే తల్లిదండ్రులు భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి, ఆర్థికంగా బాగుండాలి.
● ఒంటరి మగ వారు– మగ బిడ్డను మాత్రమే దత్తత పొందుటకు అర్హులు.
● దత్తత పొందాలనుకుంటున్న భార్యా భర్తలు ఇద్దరి అంగీకారం తప్పనిసరిగా ఉండాలి.
అనధికార దత్తత చెల్లదు
కొందరు బంధువులకు చెందిన పిల్లలను, తెలిసిన వారి పిల్లలను అనధికారికంగా దత్తత తీసుకుంటున్నారు. ఇలా అనధికార దత్తత చెల్లదు. పైగా అనధికార దత్తత తీసుకున్న వారికి జేజే యాక్టు సెక్షన్ 81 ప్రకారం ఐదేళ్లు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.
దత్తత కోరే తల్లిదండ్రులు తొలుత డబ్ల్యూ డబ్ల్యూడబ్ల్యూ.కారా.ఎన్‌ఐసీ.ఇన్ వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నింపి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
అప్‌లోడ్ చేయాల్సిన పత్రాలు
భార్యాభర్తల ఫ్యామిలీ ఫొటోగ్రాఫ్
పాన్ కార్డు
జనన ధ్రువీకరణ పత్రాలు
నివాస ధ్రువపత్రం (ఆధార్ కార్డు / ఓటర్ కార్డు / పాస్ పోర్ట్ )
సంవత్సరం ఆదాయ ధ్రువీకరణ పత్రం (సాలరి సర్టిఫికేట్/ ప్రభుత్వం జారీ చేసినటువంటి ఇన్ కమ్ సర్టిఫికేట్ / ఇన్ కమ్ టాక్స్ రిటర్న్, ప్లాయ్మెంట్ సర్టి ఫికేట్ / ఇతర ప్రాపర్టీ డాక్యుమెంట్స్)
దీర్ఘకాలిక, అంటువ్యాధి లేదా ప్రాణాంతక వ్యాధితో బాధపడలేదని, దత్తత తీసుకోవడానికి అర్హులని ధ్రువీకరిస్తూ వైద్య ప్రాక్టీషనర్ నుంచి మెడికల్ సర్టిఫికేట్ సమర్పించాలి.
అనధికార దత్తత చట్టరీత్యా నేరం
అర్హతగల వారికి అండగా శిశుగృహ
జిల్లాలో కొనసాగుతున్న జాతీయ దత్తత మాసోత్సవాలు
● దరఖాస్తు చేసుకొనే విధానం
● దరఖాస్తు చేసుకొనే విధానం


