పేర్ల నమోదులో నిర్లక్ష్యం వద్దు!
కడప ఎడ్యుకేషన్: విద్యార్థుల జీవితంలో పదో తరగతి సర్టిఫికెట్ ఎంతో కీలకం. మార్కులొక్కటే కాదు ..అందులో నమోదయ్యే వివరాలు కూడా ముఖ్యమే. భవిష్యత్తులో ఉన్నత చదువులకే కాకుండా ఉపాధి అవకాశాలకూ పదో తరగతి సర్టిఫికెట్లలోని వివరాలే ప్రధానం. ఇంతటి ప్రాధాన్యం కలిగిన మార్కుల జాబితాల్లో విద్యార్థుల వివరాలు ఎలాంటి తప్పులు దొర్లకుండా చూడాల్సిన అవస రం ఇటు ఉపాధ్యాయులపై.. అటు విద్యార్థుల తల్లిదండ్రులపై ఉంది. తాజాగా పదో తరగతి విద్యార్థుల నామినల్ రోల్స్ ఎంట్రీలు జరుగుతున్నాయి. ఈ నేప థ్యంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో పకడ్బందీగా సరి చూడాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది.
వివరాల సవరణకు ఆధార్ కేంద్రాలు
విద్యార్థులకు సంబంధించి అపార్‌లో పుట్టిన తేదీ సవరణ, ఆధార్ అప్‌డేట్ వంటి కార్యక్రమాల కోసం పాఠశాలల్లో ఇప్పటికే ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నామినల్ రోల్స్‌ను చేయించుకునేటప్పుడే ఆధార్‌కార్డులో, అపార్‌లో అన్ని వివరాలను అప్‌డేట్ ఉండాలి. ముఖ్యంగా విద్యార్థి పేరు, ఇంటిపేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు జాగ్రత్తగా సరి చేసుకోవాల్సి ఉంది. లేకుండా భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
పరీక్ష ఫీజు చెల్లించకముందే...
పదవ తరగతి విద్యార్థులు పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించకముందే వారి వివరాలను సరిచూసేలా అధికారులు ముందస్తు కార్యచరణ చేపట్టారు. ఈ మేరకు విద్యార్థుల వివరాలపై జిల్లాలోని డిప్యూటీ ఈఓ , ఎంఈఓలను అప్రమత్తం చేసింది. ఎటువంటి అపరాధ రుసుం లేకుండా పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది.విద్యార్థుల వివరాలను సరిగా లేని వారు జిల్లావ్యాప్తంగా ఐదు వేల వరకు ఉన్నారని తెలిసింది.
జిల్లావ్యాప్తంగా 619 స్కూళ్లలో..
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలు 300, ప్రైవేటు యాజమాన్య ఉన్నత పాఠశాలలో 319 మొత్తం 619 దాకా ఉన్నాయి. ఇందులో ఈ విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 29 వేలదాకా హాజరవుతారని అంచనా.
పదో తరగతి నామినల్ రోల్స్ ఎంట్రీలో జాగ్రత్త అవసరం
ఆధార్, అపార్లలో సవరణకు పాఠశాలల్లో ఆధార్ నమోదు కేంద్రాలు
పేర్ల నమోదులో నిర్లక్ష్యం వద్దు!
పేర్ల నమోదులో నిర్లక్ష్యం వద్దు!


