
కారు ఢీకొని మహిళ మృతి
జమ్మలమడుగు రూరల్ : మండలంలోని మోరగుడి గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పల్లా రాజేశ్వరి(70) మృతి చెందారు. ఎస్‌ఐ హైమావతి వివరాల మేరకు.. మోరగుడి గ్రామానికి చెందిన పల్లా రాజేశ్వరి బుధవారం రాత్రి వినాయక విగ్రహాన్ని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్నారు. రచ్చబండ సమీపానికి చేరగానే జమ్మలమడుగు నుంచి మైలవరం వైపు వెళ్తున్న కారు అతివేగంగా వచ్చి మహిళను ఢీకొంది. ఈ సంఘటనలో ఆమె తీవ్ర గాయాలవగా స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరిక్షీంచి అప్పటికి మృతి చెందినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గొర్రెల చోరీ
ముద్దనూరు : మండలంలోని తిమ్మాపురం సమీపంలో ఐదో గొర్రెలు దుండగులు చోరీ చేశారు. ఎస్‌ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు.. తిమ్మాపురం గ్రామానికి చెందిన జయరాముడు సుమారు 130 జీవాలు మేపుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి వేళల్లో వాటిని రహదారి ప్రక్కనే వున్న దొడ్డిలో వాటిని ఉంచేవాడు. మంగళవారం రాత్రి అందులోని ఐదు గొర్రెలు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాటి విలువ రూ.30వేలు ఉంటుందని బాధితుడు తెలిపారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి గాయాలు
కలసపాడు : మండలంలోని గిద్దలూరు ప్రధాన రహదారిలో గంగాయపల్లె వద్ద ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్ర మాదంలో వ్యక్తికి తీ వ్రగాయాలయ్యా యి. పోలీసుల వివరాల మేరకు.. గిద్దలూరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ప్రశాంత్‌కుమార్ కలసపాడు నుండి తన స్వగ్రామానికి బుధవారం ద్విచక్రవాహనంలో బయలుదేరారు. గిద్దలూరు నుంచి మైదుకూరుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం గంగాయపల్లె వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ప్రశాంత్‌కుమార్ తీవ్రంగా గాయపడగా, గిద్దలూరు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
కానిస్టేబుల్ ఉద్యోగాలకు
ఎంపికై న వారు హాజరుకావాలి
కడప అర్బన్: కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థులు వైద్య పరీక్షల నిమిత్తం ఆగస్టు 30, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరు కావాలని ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ తెలిపారు. ఈ నెల 30న రిజిష్టర్ నెంబర్ 4001160 నుంచి 4155879 వరకూ, సెప్టెంబర్ 1న 4156636 నుండి 4299199 వరకు సివిల్ అభ్యర్థులు, 2న 4299250 నుంచి 4504602 వరకు ఏపీఎస్పీవారైతే 4002777 నుండి 4468576 రిజిష్టర్ నెంబర్ల వరకు హాజరు కావాలని సూచించారు.

కారు ఢీకొని మహిళ మృతి