
క్వాంటం టెక్నాలజీతో నైపుణ్యాభివృద్ధి
వేంపల్లె : క్వాంటం టెక్నాలజీతో మరింత నైపుణ్యాభివృద్ధి సాధించవచ్చునని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా అన్నారు. అమరావతి క్వాంటం వ్యాలీ – 2025 హ్యక్‌థాన్‌లో భాగంగా ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో బుధవారం ఏర్పాటుచేసిన ఇంటర్నల్ హ్యాక్‌థాన్‌కు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా డైరెక్టర్ కుమారస్వామి గుప్తా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న టెక్నాలజీతో సాధ్యంకాని సమస్యలను క్వాంటం టెక్నాలజీతో సాధించవచ్చునన్నారు. అమరావతిలో 156 క్యూ–బిట్‌లతో ఐబీఎంతో కంపెనీ వారు క్వాంటం కంప్యూటర్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ నుంచి విద్యార్థులు ఈ ఇంటర్నల్ హ్యాక్ థాన్‌లో పాల్గొని సమాజానికి అవసరమైన సమస్యలకు పరిష్కార మార్గాలను వెతకాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు అమరావతి క్వాంటం వ్యాలీలో సెప్టెంబర్ నెలలో జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, రమేష్ కై లాస్, కొండారెడ్డి, రత్నకుమారి, వెంకటేష్, అరుణ్ కుమార్, రమేష్, సుధాకర్‌రెడ్డి, భాస్కరయ్య, విద్యార్థులు పాల్గొన్నారు.