
సాహసవీరుడికి సత్కారం
పోరుమామిళ్ల : పాకిస్తాన్ చెర నుంచి ఏడుగురు జాలర్లను కాపాడటంలో వీరోచిత పోరాటం చేసిన నౌకాదళ కోస్ట్ గార్డు పాలకొలను రమణారెడ్డి అభినందనీయుడని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి పి.రమణారెడ్డి, కాశినాయన మండల ఎంఈఓ మహమ్మద్‌షఫీ, రిటైర్డు వైద్యాధికారి మార్కారెడ్డి అన్నారు. స్థానిక ఎస్టీయూ భవన్‌లో గురువారం సాయంత్రం కోస్ట్‌గార్డు రమణారెడ్డికి జ్ఞాపిక అందచేసి, పూలమాల, శాలువతో సన్మానించారు. అత్యంత సాహసం చేసిన రమణారెడ్డిని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము మెడల్ అందచేయడం జిల్లాకు గర్వకారణమన్నారు. దేశ రక్షణకు అందరూ సిద్ధగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు సుబ్రమణ్యం, చంద్రహాసరెడ్డి, బాలరాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
కలసపాడు : కోస్ట్ గార్డు రమణారెడ్డికి సీజీసీ మెడల్ దక్కడంతో పీఆర్ అండ్ అర్‌డీ ప్రభుత్వ మాజీ సలహాదారుడు నాగార్జునరెడ్డి, కొండపేట గ్రామస్థులు బుధవారం రమణారెడ్డి, ఆయన తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. నాగార్జునరెడ్డి మాట్లాడుతూ పేద రైతు కుటుంబంలో జన్మించిన రమణారెడ్డి తన ప్రాణాలను లెక్క చేయకుండా జాలర్లను విడిపించేందుకు పోరాడారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బీఎస్.నారాయణరెడ్డి, రోశిరెడ్డి, రామచంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.