
యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
దువ్వూరు/ఖాజీపేట/జమ్మలమడుగు : ఎరువుల దుకాణాల యజమానులు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడిషనల్ ఎస్పీ జె.శ్రీనివాసరావు హెచ్చరించారు. దువ్వూరు, ఖాజీపేట మండలాల్లోని పలు ఎరువుల దుకాణాలను సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. గోడౌన్లలో స్టాక్‌ను తనిఖీ చేశారు. దువ్వూరులోని కాశినాయన ట్రేడర్స్, వెంకటేశ్వర ట్రేడర్స్, జువారి జై కిసాన్ ట్రేడర్స్‌లలో, చింతకుంట, కానగూడూరు, గుడిపాడుల్లోని రైతు సేవా కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. జిల్లాలో 3,350 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని, మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో 20 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 72 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ శివన్న, మైదుకూరు వ్యవసాయశాఖ ఏడీఏ కృష్ణమూర్తి, మండల వ్యవసాయాధికారి అమరనాథరెడ్డి, ఏఎస్‌ఐ భూషణం, వ్యవసాయశాఖ, పోలీసు సిబ్బందిఖాజీపేట ఏఓలు సుమంత్ కుమార్‌రెడ్డి, నాగార్చన, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు, ఏడీ అనిత, ఏఓ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్
అడిషనల్ ఎస్పీ జె. శ్రీనివాసరావు