
బైకు అదుపు తప్పి ఒకరి మృతి
సిద్దవటం : మండలంలోని కనుమలోపల్లి గ్రామ సమీపంలోని కామాక్షమ్మ గుడి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ బద్వేల్‌కు చెందిన షేక్ నాయబ్‌రసూల్(22), పి.హర్షవర్ధన్ అనే యువకులు కడప నుంచి మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో బద్వేల్‌కు బయలుదేరారు. వారు అతివేగంగా ప్రయాణిస్తూ కంట్రోల్ చేసుకోలేక సిద్ధవటం మండలం కనుమలోపల్లి గ్రామ సమీపంలోని కామాక్షమ్మ గుడి వద్ద రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొని రోడ్డు పక్క చెట్లలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో బద్వేల్‌లోని మహబూబ్‌నగర్‌కు చెందిన షేక్ నాయబ్‌రసూల్ తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనక కూర్చున్న బద్వేల్‌లోని మహబూబ్‌నగర్‌కు చెందిన పి.హర్షవర్ధన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని వైద్యం కోసం పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధవటం ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, నాయబ్‌రసూల్ మృతదేహాన్ని కడప రిమ్స్‌కు తరలించారు.
మరొకరికి గాయాలు

బైకు అదుపు తప్పి ఒకరి మృతి