
బ్రహ్మంసాగర్‌లో పడి మహిళ మృతి
బ్రహ్మంగారిమఠం: మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ నరసన్నపల్లి గ్రామానికి చెందిన మడక లక్ష్మిదేవి(39) అనే మహిళ మంగళవారం బ్రహ్మంసాగర్‌లో గల్లంతై మృతి చెందింది. బాధితులు, కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. ఇటీవల లక్ష్మీదేవి కూతురు అకస్మాత్తుగా మృతి చెందింది. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్న లక్ష్మిదేవి తన కుమారుడు స్వరూప్‌ను వెంటబెట్టుకుని మంగళవారం తెల్లవారుజామున బ్రహ్మంగారి దర్శనం కోసం ఊరి నుంచి వెళ్లింది. ఈ క్రమంలో బ్రహ్మంగారిమఠం సమీపంలోని బ్రహ్మంసాగర్‌లో స్నానం చేస్తుండగా గల్లంతైంది. తన కుమారుడి ద్వారా ఈ విషయం విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని లక్ష్మీదేవి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలి భర్త మడక రమణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శివప్రసాద్ తెలిపారు.