
విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే
జమ్మలమడుగు : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. సోమవారం ఆయన పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. ఈనెల 12వ తేదీన ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి కడపకు తీసుకెళుతున్న సమయంలో సుధీర్‌రెడ్డి అడ్డు తగిలినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేను 16వతేదీన హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే అనారోగ్యం కారణంగా రాలేనంటూ న్యాయవాదుల చేత నోటీసులు పంపించి 20వ తేదీ హాజరవుతానని తెలిపారు. 20వతేదీ పోలీసు స్టేషన్‌కు వెళ్లగా ఉన్నతాధికారులు ఎవ్వరూ లేకపోవడంతో తిరిగి 25వ తేదీ హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈమేరకు ఆయన సోమవారం విచారణకు హాజరు కాగా సీఐ విశ్వనాథ్ విచారించి స్టేషన్ బెయిల్‌తో సుధీర్‌రెడ్డిని పంపించారు.