
లోకేష్ పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన
చింతకొమ్మదిన్నె: చింతకొమ్మదిన్నె మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో అధునాతన వసతులతో నిర్మించిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ ను ఆదివారం కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎస్పీ అశోక్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. సెప్టెంబర్ 2న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో నూతన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్‌ను మంత్రిచే ప్రారంభించేందుకు సన్నాహక ఏర్పాట్ల కోసం ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లపైనా ఎస్పీతో చర్చించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జాన్ ఇర్విన్, డీఈఓ షంషుద్దీన్, ఆగ్రోస్ డీఎం జోయల్ విజయ్ కుమార్, ఎస్‌ఎస్‌ఏ, సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాల పరిశీలన
పెండ్లిమర్రి: మండల కేంద్రానికి సమీపంలో నూతనంగా రూ.12కోట్ల నిధులతో నిర్మించిన ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ఆదివారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్‌కుమార్ పరిశీలించారు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. సెప్టెంబర్ 2న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ ఏర్పా ట్లు చేస్తున్నారు. ముందస్తుగా వారు కళాశాల భవనాలను, కళాశాల పరిసరాలను పరిశీలించి కళా శాల ప్రిన్సిపల్‌తో, అధికారులతో మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ అనురాధ పాల్గొన్నారు.