
గిడుగు అడుగుజాడలు మార్గదర్శకాలు
కడప ఎడ్యుకేషన్: గిడుగు రామమూర్తి పంతుల అడుగు జాడలు అందరికీ మార్గదర్శకాలని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. ఆదివారం సీపీ బ్రౌన్ గ్రంఽథాలయంలో ముందస్తు తెలుగుభాషా దినోత్సవాన్ని జిల్లా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత గిడుగు వెంకటరామమూర్తిపంతులు చిత్రపటానికి పులమాలలు వేసి నివాళు లు అర్పించారు. పండిత పరిషత్తు జిల్లా అధ్యక్షుడు ఎఫ్‌ఎంఎస్ ఖాదర్ అధ్యక్షత వహించిన సభకు విశిష్ట అతిథిగా డీఈఓ షేక్ షంషుద్దీన్ హాజరై మాట్లాడారు. మాతృభాష తెలుగుకు ఏ భాషా సాటిరాదన్నారు. గిడుగు రామమూర్తి పండితులు తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషి తరతరాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు సంపత్‌కృష్ణ , పండిత పరిషత్తు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిచంద్ర , రాష్ట్రబాధ్యులు రమేష్, రాష్ట్ర అదనపు నరసింహారెడ్డి, పద్మానాభయ్య మాట్లాడారు. అనంతరం వంద మంది తెలుగు ఉపాధ్యాయులను సత్కరించారు.
డీఈఓ షేక్ షంషుద్దీన్