
ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం పవిత్ర ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, శాత్తుమొర, నివేదన, కుంభారాధన నిర్వహించారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు జరిపారు. ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, విశ్వక్సేనులవారికి, గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, ధ్వజస్తంభానికి , ఆలయం ఎదురుగా ఉన్న భక్తసంజీవరాయస్వామికి పూజలు నిర్వహించారు.