
లాడ్జీలను తనిఖీ చేసిన పోలీసులు
కడప అర్బన్ : నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలలో భాగంగా కడప వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని లాడ్జీలను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాడ్జీలలో బస చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డులు, ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. చట్ట విరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వరాదని, లాడ్జి పరిసరాలు స్పష్టంగా కనిపించేలా తప్పనిసరిగా సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.ఈ తనిఖీలలో కడప వన్ టౌన్ ఎస్.ఐ. అమరనాథ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.