
సెంచురీ పానెల్స్ పరిశ్రమలో విజిలెన్స్ ఏఎస్పీ ఆకస్మిక
గోపవరం : సెంచురీ పానెల్స్ పరిశ్రమలో విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్‌లో యూరియా కొరత అధికంగా ఉండటంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా సెంచురీ పానెల్స్ పరిశ్రమలో యూరియా డంప్ అవుతుందని సమాచారం రావడంతో విజిలెన్స్ సీఐ శివన్న, ఏఓ విజయరావు, బద్వేలు రూరల్ సీఐ క్రిష్ణయ్య, ఎస్‌ఐ శ్రీకాంత్, వ్యవసాయ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ యూరియా కేవలం పరిశ్రమలో వినియోగం కోసమే వాడుతున్నట్లు అధికారులు నిర్ణయించారు. ఈ తనిఖీల్లో పరిశ్రమ జీఎం రమేష్ కుమార్‌రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి ఓబయ్య ఉన్నారు.