
గంజాయి వినియోగం, విక్రయాలపై తనిఖీలు
కడప అర్బన్ : జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి సేవించే, విక్రయించే అవకాశమున్న ప్రాంతాలు, ప్రదేశాలలో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కోసం ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా విచారిస్తున్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి రవాణా, వినియోగం, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.