
గుర్తు తెలియని వ్యక్తి మృతి
బద్వేలు అర్బన్ : స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు అర్బన్ సీఐ ఎస్.లింగప్ప తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు ఆవరణలో రెండు రోజుల క్రితం అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ యువకుడిని 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆసుపత్రిలో చేర్చిన సమయంలో తన పేరు బాషా అని, తన స్వగ్రామం చాగలమర్రి అని మాత్రమే తెలిపాడు. మృతుని బంధువులు ఎవరైనా గుర్తిస్తే అర్బన్ పోలీసులకు సంప్రదించాలని ఆయన కోరారు.
పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు సన్నాహాలు
కడప అర్బన్ : ఇటీవల ఎంపికై న స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల(ఎస్.సి.టి.పి.సి)కు త్వరలో శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని (డి.టి.సి) ఆదివారం తెల్లవారుజామున జిల్లా ఎస్పీఈ.జి అశోక్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణా కేంద్రంలోని వసతి ఏర్పాట్లను, తరగతి గదులను, కార్యాలయ గదులను, మైదానం, అంతర్గత రహదారులను, బాటిల్ అబ్బాకల్ పరికరాలను పరిశీలించారు. డి.టి.సి డీఎస్పీ అబ్దుల్ కరీంకు పలు సూచనలు చేశారు.
కలకలం రేపుతున్న
క్షుద్ర పూజలు
సింహాద్రిపురం : మండల కేంద్రంలో క్షుద్ర పూజలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంలో ఈద్గా సమీపంలో వెన్నపూసపల్లెకు వెళ్లె దారిలో క్షుద్ర పూజలు పలుమార్లు జరుపుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఇది ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారో అర్థం కాక ఆ దారిన తరచూ వెళ్లే రైతులు, అలాగే మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి