
సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్
కడప అర్బన్ : శారీరక దృఢత్వం, సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు కడప నగర శివార్లలోని ఊటుకూరు సర్కిల్ నుంచి మౌంట్ ఫోర్ట్ స్కూల్ వరకూ 6 కి.మీ నిర్వహించిన సైకిల్ ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. స్వయంగా ఎస్పీ పాల్గొని పోలీస్ అధికారులు, సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైక్లింగ్ సహజ సిద్ధమైన వ్యాయామమని తెలిపారు. ప్రతి ఆదివారం పోలీసులు, ప్రజలు సైక్లింగ్‌ను అలవాటుగా చేసుకుని శారీరక దృఢత్వం, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ప్రశాంతతకు సాయపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య , ఏ.ఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ దారెడ్డి భాస్కర్ రెడ్డి, సి.కె. దిన్నె సి.ఐ. నాగభూషణం, డి.సి.ఆర్.బి ఇన్‌స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి, ఆర్.ఐ లు శివరాముడు, టైటస్, వీరేష్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ డి.కె. జావీద్, చిన్నచౌకు సి.ఐ. ఓబులేసు, చెన్నూరు సి.ఐ. కృష్ణారెడ్డి, కడప టూ టౌన్ సి.ఐ. సుబ్బారావు, సి.కె. దిన్నె ఎస్.ఐ శ్రీనివాసుల రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.