
హెచ్‌ఎంల సమస్యల పరిష్కారానికి కృషి
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రధానోపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం కడపలోని డీసీఈబీ హాల్‌లో అన్ని మండలాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో పూర్వ అధ్యక్ష, కార్యదర్శులతోపాటు కార్యవర్గం సమక్షంలో నూతన జిల్లాస్థాయి ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి ఎన్నికల పరిశీలకుడిగా శ్రీనివాసులు, బుజయ్యలు హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా జి.వెంకటసుబ్బారెడ్డి(జెడ్పీ హైస్కూల్, బద్వేల్) ప్రధాన కార్యదర్శిగా డి. చంద్రశేఖరరావు (జమ్మలముడుగు ఎంఈఓ–2) కోశాధికారిగా బి.శ్రీనివాస్ రెడ్డి (ఉర్దూ జెడ్పీ హైస్కూల్ పెన్నానగర్, ప్రొద్దుటూరు), రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా జి.విజయ భాస్కర్ రెడ్డి(ఉర్దూ జెడ్పీ హైస్కూల్, సర్వర్‌ఖాన్‌పేట, ఖాజీపేట) డివిజనల్ అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్లుగా బి. రామకృష్ణయ్య(జెడ్పీ హైస్కూల్ పెద్దకూడాల) లక్ష్మినారాయణరెడ్డి(జెడ్పీ హైస్కూల్ తొండలదిన్నె) ప్రతాపరెడ్డి( బి.మఠం హైస్కూల్) మహిళా విభాగంలోని సభ్యులను, లీగల్ కమిటీ, ఆడిట్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.