
వక్ఫ్ భూముల లీజుకు వేలం
కడప సెవెన్‌రోడ్స్: జిల్లాలోని ఏపీ స్టేట్ వక్ఫ్‌బోర్డుకు సంబంధించిన కొన్ని భూములను ఒక ఏడాదిపాటు గుత్తకు సాగు చేసుకోవడానికి వేలం పాట నిర్వహించనున్నట్లు డీఆర్వో విశ్వేశ్వరనాయుడు తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలోని డి.బ్లాక్‌లో ఉన్న జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో బహిరంగ వేలం జరుగుతుందన్నా రు. ఇందులో పాల్గొనదలిచిన వారు వక్ఫ్‌బోర్డు జిల్లా ఇన్‌స్పెక్టర్, కడప పేరిట రూ. 10 వేల బయాన చెల్లించి పాల్గొనాల్సి ఉంటుందన్నారు. వేలంలో సాగుభూములు దక్కించుకున్న వారు వెంటనే గుత్త మొత్తం చెల్లించి తగిన రశీదు పొందాలన్నారు. ప్రొద్దుటూరు మండలం మోడెంపల్లె మసీదుకు సంబంధించిన తాళ్లమాపురం గ్రామం, అలాగే అదే గ్రామంలోని అసూర్‌ఖానాకు చెందిన భూములను ఈనెల 26వ తేది మధ్యాహ్నం 2 గంటలకు వేలం వేస్తారన్నారు. పెండ్లిమర్రి మండలం గంగనపల్లె, ముద్దురెడ్డిపల్లె మసీదు, అసూర్‌ఖానాలకు సంబంధించిన భూములు అదేరోజు వేలం వేస్తామన్నారు. పులివెందుల మండలం పోల్లేపల్లె గ్రామానికి చెందిన అసూర్‌ఖానా భూములు, ఖాజీపేట మండలం తుడుములపల్లె గ్రామ సర్వే నెంబర్లలోని అసూర్‌ఖానా భూములకు వేలం పాట నిర్వహిస్తామని వివరించారు.