
● ఒకే ఇంట్లో ముగ్గురికి టీచర్ కొలువులు
కృషి, పట్టుదలతోపాటు ప్రణాళిక ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదని కడప నగరానికి చెందిన ఒక కుటుంబం నిరూపించింది. ఒకరా ఇద్దరా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి టీచర్ ఉద్యోగాలకు ఎంపికై భళా అనిపించారు. ఇందులో భార్యభర్తలతోపాటు ఆడబిడ్డ ఉండడం విశేషం. సనావుల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్‌లో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. అలాగే అతని భార్య నజీహా కరీమ్ 84.07 మార్కులతో ఉర్దూ విభాగంలో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించగా.. సనావుల్లా చెల్లెలు సయ్యద్ రేష్మా ఉర్దూ ఎస్‌జీటీ విభాగంలో 20వ ర్యాంకు సాధించడం విశేషం.