నిరీక్షణకు తెర | - | Sakshi
Sakshi News home page

నిరీక్షణకు తెర

Aug 23 2025 3:03 AM | Updated on Aug 23 2025 3:03 AM

నిరీక

నిరీక్షణకు తెర

అధిక పత్రాలతో ఇబ్బందులు

కడప ఎడ్యుకేషన్‌: డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి గత నాలుగు నెలల నుంచి నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి నిరీక్షణకు తెరదించింది. దీంతో డిగ్రీ ప్రవేశాలకు ఎదురు చూసే విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్‌ ఫలితాలు ఏప్రిల్‌ మాసంలో విడుదలైనా సింగల్‌, డబుల్‌ మేజర్‌ అంటూ దాదాపు నాలుగు నెలలపాటు కాలయాపన చేసిన ఉన్నత విద్యామండలి 20వ తేదీన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా సమూల మార్పులతో డిగ్రీ కోర్సులను తీర్చిదిద్ది గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ సింగల్‌ మేజర్‌ సబ్జెక్టునే యూజీలో కొనసాగిస్తూ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు జిల్లాలో డిగ్రీ అడ్మిషన్ల పక్రియ ప్రారంభమయింది.

24 నుంచి వెబ్‌ ఆప్షన్లకు అవకాశం...

డిగ్రీ ప్రవేశాలకు ఈనెల 26వ తేదీలోపు విద్యార్థులు ఆన్‌లైన్‌ అడ్మిషన్స్‌ మోడ్యూల్‌ ఫర్‌ డిగ్రీ కాలేజెస్‌(ఓఎంఎమ్‌డిసీ) వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ పద్ధతిలో తమకు అనుకూలమైన కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల మార్పునకు వెసులుబాటు కల్పించింది. 31వ తేదీన మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయింపు చేయనున్నారు. సెప్టెంబర్‌ 1వ తేదీ ఆయా కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులు రిపోర్టు చేసి అదే రోజు తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది,

జిల్లాలో 76 కళాశాలలలో అడ్మిషన్లు...

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ కళాశాలల్లో ఎట్టకేలకు ప్రవేశాలు ప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు నెట్‌ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 76 డిగ్రీ కళాశాలలు ఉండగా ఇందులో 10 వేలకుపైగా డిగ్రీల సీట్లు భర్తీకానున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు నాలుగు నెలలపాటు ఆలస్యం కావడంతో జిల్లాలో చాలా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్లు 50 శాతం మేర జరిగినట్లు తెలుస్తోంది.

ఫీజు వివరాలు ఇలా...

డిగ్రీలో అడ్మిషన్‌లకు సంబంధించి రిజిస్ట్రేషన్‌ సమయంలో ప్రాసెసింగ్‌ఫీజు రూపంలో ఓసీ విద్యార్థులు రూ 400, బీసీ రూ. 300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 200 చొప్పన చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ధ్రువపత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసిన విద్యార్థులు వారి పరిశీలనకు హెల్పలైన్‌ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్థులు కళాశాలలు ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది, ఆప్షన్లు మార్చుకునేందుకు 29వ తేదీ అవకాశం ఉంటుంది.

హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు?

డిగ్రీలో ప్రవేశాల కోసం ఇప్పటికే ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అప్లికేషన్స్‌కు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ డెస్క్‌లను ఏర్పాటు చేసి ఆయా కళాశాలల అధ్యాపకులు ఆన్‌లైన్‌ చేయనున్నట్లు తెలిసింది. ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు నేరుగా ఆన్‌లైన్‌లో చేసుకోవచ్చని తెలిసింది. దరఖాస్తు చేసుకునే క్రమంలో సమస్యలు ఎదురైనా, తెలియకపోయినా సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలల్లోని హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది.

జిల్లాలో కళాశాలల వివరాలు ఇలా...

వేలకు పైగా

అడ్మిషన్లకు సంబంధించిన ఆన్‌లైన్‌ ప్రక్రియలో భాగంగా సర్వర్‌ సరిగా పనిచేయడం లేదని పలువురు విద్యార్థులు తెలిపారు. దానికితోడు అధిక పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి రావడంతో మధ్యమధ్యలో సర్వర్‌ సరిగా పనిచేయక ఇబ్బందులకు గురి చేస్తోందని విద్యార్థులు పేర్కొన్నారు. ఇందులో టీసీ, ఎస్‌ఎస్‌సి మెమో, ఇంటర్‌ మెమో, 6 నుంచి 12వ తరగతి వరకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్‌, ఫొటో సిగ్నేచర్‌ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి రావడంతో ఆన్‌లైన్‌ సరిగా పనిచేయడం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకుగ్రీన్‌ సిగ్నల్‌

ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు

ఈనెల 26వ తేదీ వరకుఆన్‌లైన్‌ దరఖాస్తులు

నిరీక్షణకు తెర 1
1/2

నిరీక్షణకు తెర

నిరీక్షణకు తెర 2
2/2

నిరీక్షణకు తెర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement