
బాధితులకు న్యాయం చేయాలి
బి.కోడూరు : వివిధ సమస్యలపై పోలీసుస్టేషన్‌కు వచ్చే బాఽధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి.అశోక్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బి.కోడూరు పోలీసుస్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్‌కు వచ్చే సమస్యలను జిల్లా కేంద్రానికి రాకుండా స్టేషన్‌లోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐను ఆదేశించారు. సీసీటీఎన్‌ఎస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని ఎస్‌ఐని ఆదేశించడంతో పాటు శక్తిస్కీంల ఏర్పాటు గురించి ఎస్‌ఐని అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా వినియోగంచేలా చర్యలు తీసుకోవాలని ఎస్‌ఐను ఆదేశించారు. స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆన్‌లైన్ మోసాలపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహించాలని సూచించారు. ఉమెన్ హెల్ప్‌డెస్క్‌ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ కేసులు త్వరగా విచారించి పరిష్కరించాలన్నారు. రికార్డులు అప్‌డేట్ చేసుకోవాలని సూచించారు. సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధుల గురించి తెలుసుకున్నారు. దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా పగలు, రాత్రి ముమ్మరంగా గస్తీ నిర్వహించాలన్నారు. ఆయన వెంట మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్‌ఐ వెంకటసురేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలి
చాపాడు : పోలీసుస్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారుల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి న్యాయం చేయాలని ఎస్సీ అశోక్‌కుమార్ పేర్కొన్నారు. స్థానిక పోలీసుస్టేషన్‌ను శుక్రవారం ఎస్సీ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసుస్టేషన్‌కు వచ్చిన పలువురు ఫిర్యాదుదారులతో వారి సమస్యలపై మాట్లాడారు. ఉమెన్ హెల్ప్ డెస్క్‌ను పరిశీలించి కేసుల రికార్డులు, పెండింగ్ కేసులపై ఆరాదీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుస్టేషన్‌కు న్యాయం కోసం వచ్చే ఫిర్యాదుల సమస్యలను తెలుసుకుని న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లా ఎస్పీ ఈ.జి.అశోక్‌కుమార్