
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ కసరత్తు
● త్వరలో సర్టిఫికెట్ల పరిశీలన
● కడపలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల పరిశీలన కేంద్రంగా ఎంపిక
కడప ఎడ్యుకేషన్ : మెగా డీఎస్సీ –2025 అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్స్ పరిశీలనకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం కడప బాలాజీనగర్‌లోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలను పరిశీలన కేంద్రంగా నిర్వహించుటకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్థులు వారి టీమ్‌ల వారిగా పరిశీలన నిమిత్తం ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలకు హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అభ్యర్థులు తప్పని సరిగా వారి వారి లాగిన్‌లో htt pr://apdrc.apcfrr.in వెబ్‌సైట్ ద్వారా ఇంటిమేషన్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అభ్యర్థులు తమకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తోపాటు 5 పాస్ పోర్టు ఫోటోలతో పరిశీలనకు హాజరు కావాలి.
17 టీములు ఏర్పాటు ష్త్ర
సర్టిఫికెట్ల పరిశీలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ, రె వెన్యూ అధికారులు దాదాపు 68 మంది 17 టీముల వె రిఫికేషన్ సభ్యులతోపాటు 30 మంది వలంటీర్లు అందబాటులో ఉంచి పరిశీలనకు సిద్ధం చేస్తున్నారు. అభ్య ర్థులు వయస్సు మరియు అర్హతలకు సంబంధించిన అన్ని రకముల సర్టిఫికెట్స్‌తో పాటు అవసరమయిన ఒరిజినల్ పత్రాలు వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది.
ఒరిజినల్ సర్టిఫికెట్లు సిద్ధంగా చేసుకోవాలి
డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులంతా తమకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలి. అభ్యర్థులంతా వెబ్‌సైట్ ద్వారా ఇంటిమేషన్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు 5 పాస్‌పోర్టు ఫొటోలు తీసుకురావాలి. పరిశీలన సమయంలో సంబంధిత పత్రాలు అన్ని అందజేయాలి.
– షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి