
ఉపాధ్యాయ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల పదోన్నతులు , సర్వీసు రూల్స్ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డితో కలసి గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. ఏకీకృత సర్వీసు నిబంధనలు కొన్ని సాంకేతిక కారణాలతో అమలు కాకపోవడం వల్ల దశాబ్దాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు దొరకడం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించి పదోన్నతులు కల్పించాలని విన్నవించారు. అలాగే 223 జీఓను రద్దు చేసి పాఠశాల సహాయకులకు జూనియర్ అధ్యాపకులుగా పదోన్నతి కల్పించాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛను పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు.