
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు
కడప అర్బన్ : వినాయక చవితి పండుగ ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు, ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ సూచించారు. జిల్లాలోని వినాయక ఉత్సవాలకు గణేష్ ఉత్సవ్.నెట్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో సింగిల్ విండో విధానంలో మాత్రమే అనుమతులు పొందాలన్నారు. కేవలం మట్టి గణపతి విగ్రహాలు మాత్రమే ఉపయోగించాలన్నారు. ప్రతి మంటపం వద్ద సీసీ కెమెరాలు, అగ్ని ప్రమాద నివారణ సామగ్రి,ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఊరేగింపుల సమయంలో భక్తి గీతాలు, శాంతి సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని పేర్కొన్నారు. ఇతర మతస్తుల మనో భావాలను దెబ్బతీయకుండా, సోదరభావంతో, పరస్పర గౌరవంతో ఉత్సవాలు జరపాలని సూచించారు. వివాదాస్పద, మతపరమైన లేదా రాజకీయ ఉద్రిక్తత ఉన్న ప్రదేశాల్లో మంటపాలు ఏర్పాటు చేయకూడదన్నారు. ఇతరులను రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు, పాటలు, వ్యాఖ్యలు చేయకూడదన్నారు.
జిల్లా ఎస్పీ ఈజీ అశోక్‌కుమార్