
కలెక్టర్ దృష్టికి చియ్యపాడు దళితవాడ పాఠశాల సమస్య
చాపాడు : చియ్యపాడు గ్రామంలోని దళతవాడలో గల ఎంపీపీ స్కూల్ సమస్యను జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ దృష్టికి తీసుకెళతానని జిల్లా విద్యాశాధికారి షంషుద్దీన్ పేర్కొన్నారు. చియ్యపాడు దళతవాడకు చెందిన స్థానికులు, విద్యార్థులు సోమవా రం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ను కలిశారు. ఈ మేరకు ఆయన ఆదేశాలతో గురువారం డీఈఓ చియ్యపాడు దళితవాడ పాఠశాలను సందర్శించి ఇక్కడి గ్రామస్తులతో మాట్లాడా రు. వీరి అభిప్రాయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళతానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.శ్యాంసుందర్‌రెడ్డి, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.