
రైతు ఆత్మహత్యపై ఆర్డీఓ విచారణ
దువ్వూరు : మండలంలోని ఇడమడక గ్రామానికి చెందిన రంగాగాళ్ల బుజ్జి అనే కౌలు రైతు గత ఏడాది మే 6న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై గురువారం జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ ఇడమడక గ్రామంలో మృతుడి కుటుంబ సభ్యులను విచారించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకు భార్య, నలుగురు ఆడ పిల్లలు, ఒకు కుమారుడు ఉన్నారు. 8 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేయగా నష్టాలు రావడంతో బుజ్జి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆర్డీఓకు తెలిపారు. కూలి నాలి చేసుకుంటూ జీవిస్తున్నామని తమను ఆదుకోవాలని కోరారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపి రైతు కుటుంబానికి న్యాయం చేస్తామని ఆర్డీఓ తెలిపారు. కార్యక్రమంలో మైదుకూరు ఏడీఏ కృష్ణమూర్తి, దువ్వూరు తహసీల్దార్ సంజీవరెడ్డి, వ్యవసాయాధికారి అమరనాథరెడ్డి, ఆర్‌ఐ జాన్సన్, వీఆర్‌ఓ హరి తదితరులు పాల్గొన్నారు.
మిద్దైపె నుంచి పడి వ్యక్తి మృతి
మైలవరం : మండల పరిధిలోని మాధవాపురం గ్రామానికి చెందిన కొండయ్య(53) అనే రైతు మిద్దైపె నుంచి పడి మృతి చెందాడు. గురువారం తెల్లవారు జామున పని నిమిత్తం మిద్దె ఎక్కి దిగుతుండగా పొరబాటున జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు తెలిపారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కొండయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు.
ఫార్మసీ రంగానిదే ప్రధాన భూమిక
రాజంపేట : నేటి సమాజంలో ఫార్మసీ రంగానిదే ప్రధాన భూమిక అని అన్నమాచార్య యూనివర్సిటీ చాన్స్‌లర్ చొప్పా గంగిరెడ్డి అన్నారు. గురువారం జాతీయ స్థాయి సదస్సులో మొదటి బహుమతి సాధించిన రుక్సానా బేగం, అధ్యాపకురాలు సుష్మితను ఆయన అభినందించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మసీ విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ఫార్మసీ రంగంలో రాణిస్తే దేశ, విదేశాలలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అన్నమాచార్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత మాట్లాడారు. కార్యక్రమంలో అన్నమాచార్య ఫార్మసీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

రైతు ఆత్మహత్యపై ఆర్డీఓ విచారణ

రైతు ఆత్మహత్యపై ఆర్డీఓ విచారణ