
విద్యుదాఘాతంతో రైతు మృతి
దువ్వూరు : మండలంలోని చిన్నబాకరాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిన్నబాకరాపురం గ్రామానికి చెందిన చింతల శ్రీనివాసులు(52) తన పొలంలో అరటి పంటకు నీటి తడులు ఇచ్చేందుకు మోటార్ ఆడకపోవడంతో కనెక్షన్ సరిగా లేదని గుర్తించాడు. ట్రాన్స్‌ఫార్మర్‌కు విద్యుత్ వైర్‌ను తగిలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి రెండు ఎకరాల సొంత పొలం ఉండగా, ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని అరటి, మొక్క జొన్న, వరి పంటలను సాగు చేస్తున్నాడు. మృతుడికి భార్య శివమ్మ, కూతురు చందు ఉన్నారు. కూతురుకు ఇటీవలే వివాహం అయింది. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో భార్య శివమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనపై మృతుడి భార్య శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ వినోద్ కుమార్ తెలిపారు.