
పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
కడప కోటిరెడ్డిసర్కిల్: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కడప రైల్వేస్టేషన్‌లో రూ. 25 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ అధికారులను ఆదేశించారు. బుధవారం రేణిగుంట నుంచి గుంతకల్లుకు వెళుతూ మార్గంమధ్యలో కడపలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్య లు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం ఆయ న పనుల తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా, సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఓఎం శ్రావణ్‌కుమార్, సీనియర్ డీఎస్‌టీఈ చంద్రశేఖర్, సీనియర్ డీఈఎన్ శ్రీనివాసులు, సీసీఐ జనార్దన్, స్టేషన్ మేనేజర్ శేఖర్ కుమార్, ఆర్‌పీఎఫ్ సీఐ కోటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
దక్షిణ మధ్య రైల్వే జీఎం
సంజయ్‌కుమార్ శ్రీవాత్సవ