
బీజేపీకి సింగారెడ్డి రాజీనామా
కడప కోటిరెడ్డిసర్కిల్ : కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. బుధవారం కడపలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ తాను బీజేపీ ప్రాథమిక , క్రియాశీలక సభ్యత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌కు ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా పంపానని వివరించారు. తాను 12 ఏళ్లుగా బీజేపీలో, అంతకుముందు 12 ఏళ్లు రైతు ఉద్యమాలను చేపట్టానని తెలిపారు. తన పదవీ కాలంలో పార్టీలో మానసిక క్షోభ అనుభవించానన్నారు. బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని తెలిపారు. స్వార్థ రాజకీయాల కారణంగా సాధారణ నాయకులను పార్టీలో ఎదగనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.